Miryalaguda : సబ్ కలెక్టర్ సంచలన నిర్ణయం.. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!
Miryalaguda : సబ్ కలెక్టర్ సంచలన నిర్ణయం.. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల గైర్హాజర్ పై సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా డాక్టర్లు డుమ్మా కొట్టడంపై జిల్లా కలెక్టర్ నివేదిక అందజేయనున్నారు.
గురువారం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా 8మంది డాక్టర్లు గైహాజరైనట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విదంగా పేషెంట్ వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడి మౌలిక వసతులు, వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల పై కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ అంశాలపై సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ చర్చించారు.
MOST READ :









