తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలువిద్య

Miryalaguda : శిష్య స్కూల్లో అలరించిన బతుకమ్మ, దసరా సంబరాలు.. విద్యార్థులకు నగదు బహుమతులు..!

Miryalaguda : శిష్య స్కూల్లో అలరించిన బతుకమ్మ, దసరా సంబరాలు.. విద్యార్థులకు నగదు బహుమతులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఉన్న శిష్య ది స్కూల్ పాఠశాలలో మంగళవారం బతుకమ్మ దసరా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శిష్య పాఠశాల ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ ఉత్సవాల సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు అమ్మవారి అవతారాలుగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా రూప, శ్రీ గాయత్రీ దేవిగా బిందు, శ్రీఅన్నపూర్ణ దేవిగా లాస్య , సాయి నిహారిక, శ్రీ మహాలక్ష్మి దేవిగా మహాలక్ష్మి, శ్రీ మహా చండీగ స్నేహ, శ్రీసరస్వతి దేవిగా పవిత్ర, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా చైత్ర, దుర్గాదేవిగా లాస్య, శ్రావ్య, భవ్య, శ్రీ దుర్గ భార్గవి, శ్రీ మహిషాసుర మర్దినిగా మేఘన, మహిషాసురుడుగా శశాంక్, సాత్విక్ అలరించారు. బతుకమ్మ ఉత్సవాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆటపాటలతో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఎంఈఓ బాలు నాయక్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ప్రధమ బహుమతికి 2116 రూపాయల నగదు అక్షర రెడ్డి, ద్వితీయ బహుమతికి 1116 మాన్విత, తృతీయ బహుమతికి 516 రూపాయలు భవిత ఎంపిక కాగా పాఠశాల ప్రిన్సిపాల్ అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్ శిరీష అందజేశారు.

MOST READ :

మరిన్ని వార్తలు