తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలువిద్య

Miryalaguda : సెయింట్ జాన్స్ హెస్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు..!

Miryalaguda : సెయింట్ జాన్స్ హెస్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడలోని చైతన్య నగర్ లో ఉన్న సెయింట్ జాన్స్ హైస్కూల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి, జలంధర్ రెడ్డి, రిటైర్డ్ గవర్న మెంట్ టీచర్ నందికొండ చంద్రయ్య, రావిరాల అంజయ్య పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా పాఠశాలలో అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రకరకాల రంగు, రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి, తీసుకుని వచ్చి పాఠశాలలో ఆటాపాటలతో అలరించారు.

సెయింట్ జాన్స్ హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

విజేతలకు చైర్మన్ మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇచ్చారు. ప్రవల్లిక (మొదటి బహుమతి 2,116), మాధవి (ద్వితీయ బహుమతి) 1,116), సంధ్య (తృతీయ బహు మతి 516) అందుకున్నారు. ఈ కార్య క్రమంలో పాఠశాల చైర్మన్ అలుగుబెళ్లి శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీషా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో బతుకమ్మ ఉత్సవాలు..!

  2. Trump : H1B వీసా అంటే ఏమిటి.. ఎవరికి వస్తుంది.. ట్రంప్ సంచలన నిర్ణయం..!

  3. Bumper Offers : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. క్రోమాలో అద్భుతమైన ఆఫర్లు..! 

  4. Red Rice : రెడ్ రైస్ తింటే ఆరోగ్యమేనా.. చాలా మంది ఇష్టపడుతున్నది అందుకేనా.. తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు