Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో బతుకమ్మ ఉత్సవాలు..!

Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో బతుకమ్మ ఉత్సవాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ శనివారం ‘ఎంగిలి పూల బతుకమ్మ వేడుకను’ మిర్యాలగూడ లోని అభ్యాస్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు.
‘ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములో సందమామ…, ‘చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా.. అందాల బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’ అంటూ బతుకమ్మ పాటలతో చిన్నారులు హోరెత్తించారు. దుర్గాదేవి నవరాత్రులు విశిష్టతను తెలిపే విధంగా చిన్నారులు అమ్మవార్ల వేషధారణలతో చక్కటి ప్రదర్శన చేశారు.

ఈ వేడుకలకు అభ్యాస్ స్కూల్ డైరెక్టర్ వంగాల నిరంజన్ రెడ్డి పుష్పలత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను చిన్నారులు అందంగా అలంకరించారని అన్నారు. అనంతరం చిన్నారులను వంగాల నిరంజన్ రెడ్డి పుష్పలత అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫర్హిన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
MOST READ :
-
Air Pollution : నగరాల్లో కాలుష్యం.. ఆరోగ్యంపై పెను ముప్పు.. ఇలా నివారించవచ్చు..!
-
Hyderabad : కోకాపేట్ లో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..!
-
Bumper Offers : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. క్రోమాలో అద్భుతమైన ఆఫర్లు..!
-
TATA : టాటా పవర్ సీఎఫ్‌ఓ సంజీవ్ చురివాలాకు సీఎఫ్‌ఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు..!
-
Miryalaguda : అధికారుల ఆకస్మిక తనిఖీలు.. మద్రాస్ ఫిల్టర్ కాఫీ సీజ్.. పలు హోటళ్లకు భారీ జరిమానా..!









