Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Double Bedrooms : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లులు ఇవ్వాలని లబ్ధిదారులు రాస్తారోకో..!

Double Bedrooms : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లులు ఇవ్వాలని లబ్ధిదారులు రాస్తారోకో..!

రుద్రూర్, మన సాక్షి:

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన డబుల్ బెడ్ లబ్ధిదారులు గత ప్రభుత్వ హయాంలో ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పటివరకు బిల్లులు రాలేదని రుద్రూర్ – బోధన్ రహదారిపై మంగళవారం లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. తమ ఇంటి బిల్లులు గత 4 సంవత్సరాల నుంచి రావడం లేదని వాపోయారు.

బిల్లులు వచ్చిన కూడా తమకు ఇవ్వడంలేదని వాపోయారు. వెంటనే బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. డబులు బెడ్ రూమ్ బిల్లులు వెంటనే ఇప్పించాలని తహశీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేశారు.

MOST READ : 

  1. Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!

  2. Khammam : ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర..!

  3. RDO : ఆర్డిఓ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ..! 

  4. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

మరిన్ని వార్తలు