Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించిన కారు..!

Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించిన కారు..!

దమ్మపేట, మనసాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో గురువారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాల్వంచ నుండి దమ్మపేట వైపు వస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి వెళ్లి రోడ్డుపక్కన బైక్ రిపేర్ షాప్ వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు సహా మొత్తం ఐదు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో రోడ్డుపై వెంబడి చాలామంది స్థానికులు ఉన్నారు. అయితే కారు వారి పక్కన నుండి, పార్క్ చేసి ఉంచిన వాహనాలను ఢీ కొట్టి చివరగా విద్యుత్ స్తంభానికి ఢీకొని ఆగిపోయింది. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు తప్ప, ఇతరులు ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బీభత్సం సృష్టించిన కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

MOST READ : 

  1. Electricity Bill : విద్యుత్ బిల్లులో 50 శాతం రాయితీ.. అస్సలు మిస్ కావద్దు..!

  2. Obesity : ఉబకాయం సమస్యకు ఇక చెక్.. చికిత్సలో నూతన ఆవిష్కరణలు..!

  3. Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!

మరిన్ని వార్తలు