Gen Z: ఆర్థిక భద్రతకు పెద్ద పీట.. టర్మ్ ఇన్సూరెన్స్‌పై జెన్ జెడ్ ఆసక్తి..!
Gen Z: ఆర్థిక భద్రతకు పెద్ద పీట.. టర్మ్ ఇన్సూరెన్స్‌పై జెన్ జెడ్ ఆసక్తి..!
ముంబై , మన సాక్షి:
డిజిటల్ ప్రపంచంలో మునిగి తేలుతున్నప్పటికీ, భారతీయ యువతరం జెన్ Z ఆర్థిక భద్రత విషయంలో మాత్రం చాలా ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తోంది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. దీర్ఘకాలిక భద్రత, తక్కువ ఖర్చు, సులువుగా ఉండటం వంటి కారణాల వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ వారికి ముఖ్యమైన ఆర్థిక సాధనంగా మారుతోంది.
‘కొత్త తరం అలవాట్లు, సంప్రదాయ విలువలు: ఆర్థిక ప్రణాళికలపై జెన్ Z తీరు’ పేరుతో 21-28 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగం చేస్తున్న జెన్ Z యువతపై ఈ అధ్యయనం చేశారు. ఈ తరం టెక్నాలజీతో పాటు భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను కేవలం ఒక రక్షణగా కాకుండా, తమ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాదిగా భావిస్తోంది.
ముఖ్య అంశాలు:
టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం: పెరుగుతున్న ఆర్థికపరమైన రిస్కులు, తక్కువ ధరలో లభించే అవకాశం ఉండటంతో జెన్ Z టర్మ్ ప్లాన్లను ఎక్కువగా ఎంచుకుంటోంది. 31 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది మిగిలిన జీవిత బీమా పాలసీల కంటే ఎక్కువ. ప్రతి నలుగురిలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు వెల్త్ ప్లాన్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న వారిలో 57 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
త్వరగా రిటైర్మెంట్ ఆలోచనలు: జెన్ Z తరం వీలైనంత త్వరగా రిటైర్ అవ్వాలని భావిస్తోంది. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి, త్వరగా రిటైర్ అవ్వాలనే సిద్ధాంతంపై వారి ఆసక్తి పెరుగుతోంది. దీంతో దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. గత తరాల వారిలా కాకుండా, 18 శాతం మంది ఇప్పటికే రిటైర్మెంట్, పెన్షన్ ప్లాన్ల గురించి ఆలోచిస్తున్నారు.
ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాముఖ్యం:
జెన్ Z ఆరోగ్యం, సంక్షేమం వంటి ప్రయోజనాలు లేని ఆర్థిక సాధనాలపై ఆసక్తి చూపడం లేదు. జీవిత బీమా సంస్థను ఎన్నుకునేటప్పుడు 60 శాతం మంది ఆరోగ్య ప్రయోజనాలు అందించే వాటికే ఓటు వేస్తున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులు (65 శాతం) వెల్నెస్ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ జె. కల్రా మాట్లాడుతూ…. జెన్ Z డిజిటల్ తరం వారైనా, దీర్ఘకాలిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ వంటి వాటిని ఎంచుకుంటున్నారని తెలిపారు. ఆర్థిక భద్రత, ఆరోగ్యం, ముందస్తు రిటైర్మెంట్ ప్రణాళికలపై దృష్టి పెడుతూ తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
డిజిటల్ అలవాట్లు, సంప్రదాయ విలువల కలయిక:
జెన్ Z ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పటికీ, ఆర్థిక విషయాల్లో మాత్రం నమ్మకమైన వాటికి ప్రాధాన్యమిస్తోంది. 53 శాతం మంది బీమా పాలసీల కోసం ఏజెంట్లు లేదా బ్యాంక్ సలహాదారులపై ఆధారపడుతున్నారు. అయితే, 25 శాతం మంది సోషల్ మీడియా నుండి కూడా ఆర్థిక సలహాలు తీసుకుంటున్నారు. జెన్ Z తరం చిన్న వయస్సులోనే ఆర్థిక విషయాల్లో పరిణతి చూపిస్తోంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను ముందుగానే తీసుకోవడం, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవడం, సంపదతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం వంటి వాటి ద్వారా భవిష్యత్తు దేశ ఆర్థిక ప్రణాళికలను మారుస్తోంది.
MOST READ :
-
NagarjunaSagar : సాగర్ బుద్దవనంలో ప్రపంచ సుందరీలు..!
-
Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!
-
PhonePe : ఫోన్ పే, ఇవేం డిజిటల్ పేమెంట్స్ రా బాబు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : ఆరోగ్యము పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.. అవగాహన కల్పించిన జన విజ్ఞాన వేదిక..!
-
Shaligowraram : పూర్వ విద్యార్థుల 20 ఏళ్ల ఆత్మీయ కలయిక..!









