UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!
మన సాక్షి :
దేశంలో UPI ద్వారా చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. యూపీఐ సేవలను కూడా ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు కూడా డిజిటల్ చెల్లింపుల యాప్ లె ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర యాప్ ల ద్వారా చెల్లింపులు కొనసాగిస్తున్నారు. ఎక్కువగా డిజిటల్ చెల్లింపులకు ప్రజలు వినియోగిస్తున్నారు. దానికి ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
కానీ ప్రభుత్వం యూపీఐ యూజర్లకు భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం 2000 రూపాయల పైబడి చేసే ట్రాన్జక్షన్లకు 18% చొప్పున జిఎస్టి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజల జీవితాల్లో యూపీఐ వినియోగం సాధారణ చర్యగా మారిపోయింది. దాంతో పన్ను ఆదాయాన్ని ప్రభుత్వం పెంచుకోవడానికి జీఎస్టీ ని విధించాలని భావిస్తున్నట్లు సమాచారం.
దాంతో చాలామంది ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇది అమలులోకి వస్తే వినియోగదారుల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరిపై కూడా అదనపు భారం పడే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపులపై జిఎస్టి విధిస్తే యూపీఐ చెల్లింపులు తగ్గే అవకాశం ఉంది. భౌతిక కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది.
స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ :
అయితే ₹2,000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై వస్తు మరియు సేవల పన్ను (GST) విధించడాన్ని ప్రభుత్వం పరిగణించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2,000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై వస్తు మరియు సేవల పన్ను (GST) విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వాదనలు పూర్తిగా తప్పు ఎటువంటి ఆధారం లేనివి. ప్రస్తుతం ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదని తెలిపింది.
నిర్దిష్ట సాధనాలను ఉపయోగించి చేసే చెల్లింపులకు సంబంధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వంటి ఛార్జీలపై GST విధించబడుతుంది. జనవరి 2020 నుండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 30 డిసెంబర్ 2019 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పర్సన్-టు-మర్చంట్ (P2M) UPI లావాదేవీలపై MDRని తీసివేసింది. ప్రస్తుతం UPI లావాదేవీలపై MDR ఛార్జ్ చేయబడదు కాబట్టి, ఈ లావాదేవీలకు GST వర్తించదు. UPI ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
Similar News :
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
-
UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!









