TG News : టీచర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే ఉద్యోగం ఊస్ట్..!

TG News : టీచర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే ఉద్యోగం ఊస్ట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, ఇష్టానుసారంగా సెలవులు పెట్టడంపై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలకు సిద్ధమయింది. ముఖ గుర్తింపు హాజరు విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల హాజరు, అనధికారిక గైర్హాజరు వివరాలపై దృష్టి సారించింది.
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్.. డీఈవో లతో ఆన్ లైన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుడు అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా చెప్పాబెట్టకుండా నెల రోజులపాటు విధులకు గైరాజ రైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు.
వాస్తవానికి ఒక్కరోజు అనధికార గైర్హాజరు పైన చర్యలు తీసుకోవచ్చు అయినప్పటికీ ఉపాధ్యాయులు అనారోగ్యం లేదా ప్రమాదం వంటి సాకులు చెప్పి కోర్టులో కేసులు వేసే అవకాశం ఉన్నందున నెల రోజులపాటు గడువు తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణ జరుపి తొలగించాలని నిర్ణయించారు. ఉద్యోగం నుంచి తొలగింపు వివరాలను కూడా గెజిట్ లో ప్రచురించాలని ఆదేశించారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి అమలులో ఉన్న ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయాన్ని కచ్చితంగా నమోదు అవుతుంది. ఇప్పటివరకు కేవలం హాజరయ్యారా లేదా అనే విషయం పై దృష్టి పెట్టగా ఇకనుంచి ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయుల ఆలస్యంపై కూడా దృష్టి పెట్టమన్నారు. భవిష్యత్తులో సమయపాలన మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
దీర్ఘకాలిక సెలవులు తీసుకుని వాటిని ఉపయోగించుకోకుండా ఒకటి, రెండు సంవత్సరాల పాటు విధులకు హాజరుకాని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఎక్కువగా విదేశాల్లోనే తమ పిల్లలు లేదా భాగస్వాములు వద్దకు వెళ్లేందుకు ఈ సెలవులు తీసుకుంటున్నారు.
అలాంటి వారిని గత రెండేళ్లలో సుమారు 50 మందిని విద్యాశాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 వేల పాఠశాలల్లో 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వారిలో 6,100 మంది డిప్యూటేషన్ లపై ఇతర విభాగాల్లో ఉన్నారు.
దీర్ఘకాలికంగా గైరాజరవుతున్న ఉపాధ్యాయులను కూడా తొలగింపు చర్యలు చేపట్టాలని డిఇఓ లకు విద్యాశాఖ అధికారి ఆదేశించారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు మెరుగుపడుతుందని ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
MOST READ :
-
TG NEWS : సర్పంచ్ ఎన్నికల వేళ.. మద్యం రవాణా.. తనిఖీలలో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు..!
-
Miryalaguda : జెవివి టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన SPR స్కూల్ విద్యార్థులు..!
-
Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!
-
Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!









