Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!
మున్సిపల్ ఎన్నికల వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి పలు వార్డుల ఇన్చార్జిలు సైతం రాజీనామాలు చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. వరుసగా బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ నాయకులకు కూడా అంతు పట్టడం లేదు.

Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మున్సిపల్ ఎన్నికల వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి పలు వార్డుల ఇన్చార్జిలు సైతం రాజీనామాలు చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. వరుసగా బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ నాయకులకు కూడా అంతు పట్టడం లేదు.
బుధవారం మిర్యాలగూడ టౌన్ 27 వార్డు కాంగ్రెస్ వార్డు ఇంచార్జ్ రేబెల్లి లోహిత్ కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కారు పార్టీలో చేరారు. బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్ద, మిర్యాలగూడ పట్టణ ముఖ్య నేతలు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి.ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీ ఆర్ ఎస్ లో చేరారు. కార్యాలయంలో అనుచరులు 200 మందితో కలిసి బీ ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు.
అనంతరం వారు మాట్లాడుతూ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహినపడిపోతుందని, రాబోయే భవ్యిషత్తు అంతా బీ ఆర్ ఎస్ దే నని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి అందరూ కృషి చేయాలనీ దానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు చిహ్నం కావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధులకు ఇచ్చిన హామీలు ఏమైనాయని నిలదీయాలని సూచించారు.
ఏ ఒక్క హామీ అయిన పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా పూటకో మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధముగా మనకు ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ పడిన బాకిని కరపత్రాల రూపంలో ఇంటింటికి పంచి వారు మన బాకీని వెంటనే అమలు చేసేలా డీమాండ్ చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమములో పద్మశెట్టి కోటేశ్వర రావు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి చీరంజీవి, ఎండి.షోయబ్, పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, కంచి సత్యనారాయణ, నల్లగంతుల నాగభూషణం, యర్రమళ్ళ దినేష్, దోనేటి సైదులు, శ్రినాద్, జీవన్, వడ్డేపల్లి శ్రీనివాస్, హరి, తరుణ్, బాచి, కూరపాటి సాంబశివ రావు, సిరసనగండ్ల ఈశ్వర్ చారి, మీసాల జగదీష్ నాంపల్లి యేసు, నరేష్ పార్టీలో చేరిన వారు స్వాతి, ప్రదీప్, కృష్ణ, సతీష్, నవీన్, గణేష్, కార్ల యల్లయ్య, శ్రీను, నాగయ్య, బంగారి తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Nalgonda : తెలంగాణ ట్రాన్స్కో డిస్కం ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్స్ ప్రారంభం..!
-
ఆయిదేళ్లుగా స్టూడెంట్తో టీచర్ ప్రేమ.. తన భర్త తనకు కావాలంటూ భార్య ఆవేదన..!
-
Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు, జాగీరు కాదు.. రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!
-
Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..!
-
Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!










