Breaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

పెద్ద పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..!

పెద్ద పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..!

కామారెడ్డి జిల్లా దోమకొండ, మన సాక్షి:

అంబారిపేట, సంగమేశ్వర్ గ్రామ శివారులలో, పెద్దపులి దాడితో రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందడంతో, సంఘటన స్థలాన్ని జిల్లా అటవీ అధికారిణి డి ఎఫ్ వో నిఖిత, అటవీ అధికారుల బృందం ఆధ్వర్యంలో మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా డి ఎఫ్ వో నిఖిత మాట్లాడుతూ….. పెద్దపులి సంచారంతో అంబరిపేట గ్రామానికి చెందిన ,రైతులు కోమటి శ్రీనివాస్ యొక్క దున్నపోతు , సంగమేశ్వర్ గ్రామనికి చెందిన ఓ రైతు లేగ దూడను చిరుత పులి దాడితో మంగళవారం ఉదయం వ్యవసాయ క్షేత్రంలో మృతి చెంది ఉన్నాయని తెలిపారు.

చిరుత పులి కదలికల కోసం సంఘటన జరిగిన ప్రాంతంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. చిరుత పులి దాడిలో మృతిచెందిన రెండు పశువులను పశు వైద్యాధికారి శివకుమార్ ఆధ్వర్యంలో శివ పంచానమ నిర్వహించి వాటి నివేదికను పై స్థాయి అధికారులకు నివేదిక అందజేశామని తెలిపారు. బాధిత రైతులకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందిస్తామనని తెలిపారు.

పెద్దపులి సంచారం నేపథ్యంలో పశువులను, గ్రామంలోని ఇంటి వద్ద ఉంచుకోవాలని, వ్యవసాయ పొలం వద్దకు రాత్రి సమయంలో వెళ్ళవద్దని రైతులకు , ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డివో రామకృష్ణ, ఎఫ్ ఆర్ వో రమేష్, ఎఫ్ బివో పద్మ, నాయకులు ఆరుట్ల అనిల్, గ్రామస్తులు, రైతులు తదితరులు ఉన్నారు.

MOST READ 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతంగా పూర్తి చేయాలి..!

  2. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  3. SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!

  4. LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు