Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!
Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలపై ప్రతి గ్రామంలో చర్చలు కొనసాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తారని ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. కాగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ నెలకొన్నది.
ఆ విషయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతి లో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణన చేసిన తర్వాతనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కులగనణకు క్యాబినెట్ తీర్మానం చేసి జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టే కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే కుల గణన కార్యక్రమం జరుగుతుందని దానిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులకణనపై అనేక పర్యాయాలు ఆరా తీశారని, కుల గణన కార్యక్రమం ఏజెన్సీ గాని డిపార్ట్మెంట్ తో గాని చేయించాలనే చర్చ కూడా జరుగుతుందని, మరో వారం రోజుల్లో కులగణనకు సంబంధించిన పేపర్ వర్క్ ను బయటపెడతామని స్పష్టం చేశారు.
కుల గణన పూర్తయితే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ మారుతుందా..? లేదా..? పాత రిజర్వేషన్ల ప్రకారమే నిర్వహిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ ప్రక్రియ చేపడితే సెప్టెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయా..? మరి కాస్త ఆలస్యం అవుతాయా..? అనే విషయంపై మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉంది.
ALSO READ :
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!









