జాతీయంBreaking Newsసినిమాహైదరాబాద్

Bigg Boss 9 Winner : బిగ్ బాస్ విన్నర్ గా కామన్ మ్యాన్ కళ్యాణ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..!

Bigg Boss 9 Winner : బిగ్ బాస్ విన్నర్ గా కామన్ మ్యాన్ కళ్యాణ్.. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలుగు బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ గా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల నిలిచాడు. డిసెంబర్ 21 రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలే ప్రోగ్రాంలో కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలని నాగార్జున విన్నర్ గా ప్రకటించారు.

కామన్ మ్యాన్ గా కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 షోలో అడుగు పెట్టాడు. సామాన్యుడు తలుచుకుంటే జరగనిది ఏమి ఉండదని నిరూపించాడు. అతడి సంకల్పానికి ప్రజల అభిమానం తోడైంది. ఫలితంగా విజేతగా నిలిచాడు. సెలబ్రిటీ తనుజను ఓడించి విజయపతాకం ఎగరవేశాడు. ఒక సామాన్యుడు బిగ్ బాస్ 9 ట్రోఫీ అందుకోవడంతో సామాన్యులంతా గెలిచినట్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..?

బిగ్ బాస్ 9 టీం లో సామాన్యులందరికీ కూడా వారానికి ఎంత రెమినరేషన్ ఇవ్వాలనే విషయంపై ఫిక్స్ చేశారు. అందరి లాగే కళ్యాణ్ కు కూడా ప్రతి వారానికి 70 వేల రూపాయలు అందాయి. 15 వారాలకు గాను 10.50 లక్షల రూపాయలు అందుకున్నాడు.

అదే విధంగా విన్నర్ ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయలు కూడా కైవసం చేసుకునే వాడే కానీ మూడో స్థానంలో నిలిచిన డెమాన్ పవన్ కు 15 లక్షల సూట్కేస్ ఇవ్వడంతో మిగిలిన 35 లక్షలు కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు.
దాంతో పాటు రాఫ్ టైల్స్ వారు మరో 5 లక్షల రూపాయల గిఫ్ట్ అందజేశారు. మొత్తంగా 50 లక్షల రూపాయలకు పైగానే అందుకున్నాడు.

అదేవిధంగా మారుతి సుజుకి చెందిన విక్టోరిస్ కారును సైతం సొంతం చేసుకున్నాడు. ఈ కారు ఆరు వేరియంట్లలో లభించే దీని విలువ 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల మధ్య ఉంటుంది.

MOST READ 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

  2. Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

  3. Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ వైద్యుల బాగోతం బట్టబయలు.. క్రిమినల్ కేసులు, నోటీసులు..!

మరిన్ని వార్తలు