Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణ

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందివ ప్రభుత్వ కార్యాలయాలకు, యూనివర్సిటీలను సొంత భవనాలలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇక మీదట ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాలలో నే కొనసాగాలని నిర్ణయించింది.

అందుకుగాను 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రైవేట్ భవనాల అద్దె చెల్లింపులను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రైవేట్ భవనాల్లో ఉన్న కార్యాలయాలను ప్రభుత్వ భవనాలలోకి మార్చాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలను వీలైనంత త్వరగా మార్చాలని పేర్కొన్నది.

డిసెంబర్ 31వ తేదీలోగా ప్రైవేట్ అద్దె భవనాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాలకు షిఫ్ట్ చేయాలని, అన్ని శాఖల ప్రభుత్వ స్థలాల గుర్తింపు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆయా శాఖల అధిపతులే వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని, అద్దె వాళ్లే చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది.

MOST READ 

  1. Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

  2. Food : దోష, ఇడ్లీ, వడ.. టిఫిన్ ఏదైనా టమోటో చట్నీ.. ఇలా చేస్తే రెస్టారెంట్ టెస్ట్.. అదిరిపోయేలా..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో డబ్బులు జమ..!

  4. Nalgonda : డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసానికి పన్నాగం.. రూ.18 లక్షల బదిలీకి యత్నం, పోలీసుల చాకచక్యం..! 

మరిన్ని వార్తలు