Breaking NewsTOP STORIESసినిమాహైదరాబాద్

Bigg Boss Telugu 8 : సోనియా ఆ తప్పు వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయిందా..!

Bigg Boss Telugu 8 : సోనియా ఆ తప్పు వల్లే ఇంటి నుంచి వెళ్లిపోయిందా..!

మన సాక్షి, సినిమా:

బిగ్ బాస్ 8 తెలుగు ఎంతో రసవత్తరంగా సాగుతుంది. చివరి వరకు ఉండి విన్నర్ గా నిలవాలి అనుకున్న సోనియా ఆకుల నాలుగో వారానికే ఎలిమినేట్ అయింది. అందుకు ఆమె అతి విశ్వాసం తో పాటు హౌస్ లో ఉన్న వాళ్లందర్నీ తక్కువ అంచనా వేయడమే అని చెప్పవచ్చును. ఎంతో మందిని ఇంటికి పంపాలని భావించింది. కానీ పాపం ఆమెనే వెళ్ళిపోవాల్సి వచ్చింది.

ఈ సీజన్ లో కెప్టెన్సీ ఉండరని దానికి బదులు చీప్స్ ఉంటారని బిగ్ బాస్ ముందే చెప్పాడు. కానీ షో మొదలైన రెండు రోజుల్లోనే సత్తా తెలుసుకోవడం కష్టం కాబట్టి నిఖిల్ తన ఫ్రెండ్ యష్మిని చీఫ్ గా సెలెక్ట్ చేశాడు. అందుకు సోనియా పెద్ద రాద్ధాంతం చేసింది.

నిఖిల్ తో మితిమీరిన హగ్గులు, అతడిని అభ్యంతరకరంగా టచ్ చేయడం చూసి ప్రేక్షకులు సోనియాను చీదరించుకున్నారు. నిఖిల్, పృద్విని ఆమె గుప్పిట్లో పెట్టుకుని వెంట తిప్పుకున్నారని ప్రేక్షకులు భావించారు.

ఆమె తన గేమ్ ఆడక పోవడంతో పాటు నిఖిల్, పృథ్విలను కూడా చెడగొట్టి గేమ్ ఆడనివ్వలేదు. యష్మిని, నిఖిల్, పృద్విని చూస్తే ఎలా అని సెటైర్లు వేసిన ఈమె మరి ఎంతసేపు ఆ ఇద్దరి వెంట తిరుగుతూ ఉండేది. ఆమె కొంచమైనా ఆలోచించకపోవడం, టాస్కుల్లో ఆడక పోవడం, ఇదంతా ప్రేక్షకులు గమనించారు.

ఆమె ఆడపులి అనే ట్యాగ్ కేవలం హౌస్ లో ఉన్న వారందరిపై నోరు చేసుకోవడం తప్ప దానికి న్యాయం చేయలేదు. అయితే ఆమె నాలుగో వారానికే బయటికి రావడం ఆమెకు పారితోషకం తక్కవ తీసుకున్నట్లు తెలుస్తుంది.

LATEST UPDATE : 

 

మరిన్ని వార్తలు