Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Karnataka to telangana : కర్ణాటక నుంచి తెలంగాణకు నల్ల బెల్లం రవాణా.. భారీగా పట్టివేత..!

Karnataka to telangana : కర్ణాటక నుంచి తెలంగాణకు నల్ల బెల్లం రవాణా.. భారీగా పట్టివేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

కర్ణాటక రాష్ట్రంలో కొనుగోలు చేసి తెలంగాణకు నల్ల బెల్లం అక్రమంగా రవాణా సాగుతుంది. పోలీసుల నిఘాలో పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా 11.40 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టుకోవడం జరిగిందని సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కర్ణాటక రాష్ట్రం గుర్మిట్ కల్ నుండి మహబూబ్నగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 38 బ్యాగుల నల్ల బెల్లం ఉన్నట్టు గుర్తించామన్నారు.

కిరణ్, రాజు అనే వ్యక్తులను పట్టుకొని విచారించగా గుర్మీట్ కల్ కు చెందిన హనుమాన్ నాయక్ అనే వ్యక్తి వద్ద బెల్లం కొనుగోలు చేసి మహబూబ్నగర్ కు తీసుకెళ్తున్నామని తెలిపారు.

పట్టుబడిన నల్ల బెల్లం 11.40 క్వింటాళ్ల ఉండగా వాటి విలువ 1,14,000/- రూపాయలు ఉంటుందని, నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహన డ్రైవర్ కిరణ్ ను పట్టుకొగా రాజు పారిపోయాడని తెలిపారు. అట్టి వాహనాన్ని సీజ్ చేసి బెల్లం అమ్మిన వ్యక్తి హనుమాన్ నాయక్ మరియు కిరణ్, రాజు ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ శివ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

MOST READ : 

  1. Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా పడిపోయిన గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!

  2. Nalgonda : వీళ్లు మామూలోళ్ళు కాదు.. పార్కింగ్ చేసిన లారీలు కనిపిస్తే మాయం..! 

  3. Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!

  4. రేపు మౌని అమావాస్య.. ఎందుకు అంత విశిష్టమైనది..!

మరిన్ని వార్తలు