TOP STORIESBreaking Newsతెలంగాణ

వికసించిన బ్రహ్మ కమలం.. పురాణాలు ఏం చెబుతున్నాయి..! 

వికసించిన బ్రహ్మ కమలం.. పురాణాలు ఏం చెబుతున్నాయి..! 

అందోలు, మనసాక్షి :

ఎక్కడో హిమాలయ ప్రాంతాలకే పరిమితమైన బ్రహ్మ కమలము ఇప్పుడు పలు ఇళ్లల్లో వికసిస్తోంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు సంగారెడ్డి జిల్లా అందోలు మండల పరిధిలోని కన్సన్ పల్లి గ్రామానికి చెందిన వని రమేష్, సుకన్య దంపతుల ఇంట్లో గురువారం రాత్రి పదిన్నర గంటల తరువాత పూసి అందరినీ పులకింప చేసింది.

సాయంత్రమే మొక్కకు మొగ్గ కనిపించడంతో అందరూ ఆసక్తిగా ఆ పువ్వు కోసం ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే పదిన్నర గంటల తర్వాత మెల్లి మెల్లిగా విప్పుతూ పుష్పం గా మారింది. బ్రహ్మను పోలి ఉన్న కారణంగా ఈ పుష్పానికి సుకన్య, రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ పుష్పాన్ని చూడడం ద్వారా అనేక మానసిక రుగ్మతలు, అనారోగ్యాలు తొలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వికసించిన తరువాత కేవలం రెండు గంటలు మాత్రమే ఉన్న ఈ పుష్పం ఆ తర్వాత వాడి పోయింది. ఈ దృశ్యాలను రమేష్, సుకన్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా ఆసక్తిగా తిలకించారు.

ALSO READ : 

Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

అమెరికాలోని డల్లాస్ లో కోమటిరెడ్డి కి ఘన స్వాగతం..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

 

మరిన్ని వార్తలు