Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Breaking : పాలేరు వాగులో పడి తడకమళ్ళ వ్యక్తి మృతి..!

పొలం కాడికి వెళ్లేందుకు.. పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చోటు చేసుకుంది.

Breaking : పాలేరు వాగులో పడి తడకమళ్ళ వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

పొలం కాడికి వెళ్లేందుకు.. పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తడకమళ్ళ గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య.. రోజు మాదిరిగా గ్రామ శివారులోని తన పొలం కాడికి వెళ్తుండగా.. వాగులో పడి మృతి చెందినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమీపంలో మృతిదేహం వాగులో లభ్యమైనట్టు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి కుమారుడు అనంతల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు