Breaking Newsజాతీయం
Breaking News : టాప్ 10.. మనసాక్షి ఫ్లా ష్ న్యూస్..!
మన సాక్షి వెబ్ పోర్టల్ ఎప్పటికప్పుడు మీకు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. మంగళవారం టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ మీ ముందు..

Breaking News : టాప్ 10.. మనసాక్షి ఫ్లా ష్ న్యూస్..!
మన సాక్షి వెబ్ డెస్క్:
మన సాక్షి వెబ్ పోర్టల్ ఎప్పటికప్పుడు మీకు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. మంగళవారం టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ మీ ముందు..
- ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పలువురికి గాయాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళుతున్న నిడదవోలు ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. కేతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
- సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం ఏడు గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. రేపు ఉదయం 3 గంటలకు ఆలయం తెరవనున్నారు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్య పూజలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు.
- విజయవాడలో అంగన్వాడి కార్యకర్తల అరెస్టు.. తెల్లవారుజామున ఒక్కసారిగా అంగన్వాడీ కార్యకర్తల ధర్నా శిబిరం వద్దు పోలీసులు చేరుకున్నారు. పోలీసులు అరెస్టు చేశారు.
- చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత. సుమారు పదిన్నర గంటల పాటు మూతపడనున్న తిరుమల ఆలయం. ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలను టిటిడి అధికారులు మూసిచేశారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్ రియల్ ఎస్టేట్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య:
- ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బీబీనగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకల మహేష్ యాదవ్ భార్య ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి ఐశ్వర్య తీవ్ర మనస్ధాపంతో తన ఇద్దరు చిన్నారులను ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అనంతరం వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య కుటుంబ విభేదాలు ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
- తిరుమల క్యూ లైన్ లో భక్తుల మధ్య ఘర్షణ.. బెల్ట్ తీసి మరి మరో భక్తుడు పై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- జల్లికట్టులో తీవ్ర విషాదం నెలకొన్నది. ముగ్గురు మృతిచెందగా 76 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని శివగంగా జిల్లా సమీపంలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో ఎద్దులు ప్రేక్షకుల పైకి దూసుకెళ్లాయి. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా 76 మందికి గాయాలయ్యాయి.
- రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. యువకులు మహిళలు అన్ని వర్గాల వారు రంగులు చల్లుకొని ఉత్సవాలు జరుపుకుంటున్నారు.
- దుబాయిలో సూపర్ మార్కెట్లు ఖాళీ అయ్యాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్ లోని పలు ప్రాంతాల్లో దాడులు సాగుతున్నాయి. ఈ క్రమంలో సూపర్ మార్కెట్లో ప్రయాణ ప్రాంగణాలు మొత్తం ఖాళీ అయ్యాయి.
MOST READ :
- ACB : ఏసీబీ అధికారుల మెరుపుదాడులు.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అధికారి..!
- పశ్చిమాసియాలో యుద్ధం.. తెలంగాణ అప్రమత్తం.. న్యూఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
- APSRTC : ముగిసిన ఏపీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ శిక్షణ తరగతులు..
- నల్గొండ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..!









