BREAKING : టాప్ 7.. మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!
మనసాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. అందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన బ్రేకింగ్ న్యూస్ మీకోసం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్..

BREAKING : టాప్ 7.. మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!
మన సాక్షి :
మనసాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. అందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన బ్రేకింగ్ న్యూస్ మీకోసం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్..
ఇంటర్ విద్యార్థిని ప్రసవం
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని (16) నిన్న పరీక్ష రాసి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచన మేరకు స్కానింగ్ సెంటర్ కు వెళ్ళింది. కాగా అక్కడే బాత్రూంలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. అది గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. తనను జైల్లో కూడా హింసించారని ఆరోపణ. చలి పెడుతున్నప్పటికీ మూడు రోజుల కొట్లాడితేనే దుప్పటి ఇచ్చారని, దోమలు ఉన్న రూమ్ లో వేశారని ఆరోపించారు. గొంతు నొప్పి, ఫీవర్ వస్తే కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వలేదని బాల్క సుమన్ ఆరోపించారు.
చెల్లెలి వరసైన అమ్మాయిని వేధించిన యువకుడు
జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన జరిగింది. చెల్లెలి వరుసైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ మనోజ్ అనే యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆమెను బలవంతంగా లొంగ తీసుకున్నాడు. దాంతో ఏం చేయలేక సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమ్మాయిని వేధింపులకు గురి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
జాతరలో అగ్నిగుండంలో చిక్కిన పదిమంది భక్తులు
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు జాతరలో అపశృతి నెలకొన్నది. ఆమనగల్లు లోని శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో మంగళవారం రాత్రి అగ్నిగుండాల సమయంలో ఒకరినొకరు నెట్టుకొని పదిమంది భక్తులు అగ్గిగుండంలో పడిపోయారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నడిరోడ్డుపై కారు దగ్ధం
రన్నింగ్ కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది 65వ జాతీయ రహదారిపై రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తంగా డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపాడు. ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేశారు.
విమానాల రద్దు తో ప్రయాణికుల ఇక్కట్లు
విమానాల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు.
తిరుమల వెళ్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి :
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించింది. గంగవరం మండలంలోని వైయస్సార్ జంక్షన్ వద్ద లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల దైవదర్శనికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
MOST READ
- CM Revanth Reddy : ఐదు దశల్లో 10 అంశాలు.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమాలు..!
- CM Revanth Reddy : ఐదు దశల్లో 10 అంశాలు.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి కార్యక్రమాలు..!
- Breaking News : టాప్ 10.. మనసాక్షి ఫ్లా ష్ న్యూస్..!
- పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80% డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టత..!
- TG : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన.. కల్వకుంట్ల కవిత ట్వీట్..!









