Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

TG : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన.. కల్వకుంట్ల కవిత ట్వీట్..!

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాదుకు విచ్చేశారు. డిసిసి అధ్యక్షులు శిక్షణ కోసం తెలంగాణ వచ్చిన రాహుల్ గాంధీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.

TG : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన.. కల్వకుంట్ల కవిత ట్వీట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాదుకు విచ్చేశారు. డిసిసి అధ్యక్షులు శిక్షణ కోసం తెలంగాణ వచ్చిన రాహుల్ గాంధీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.

కాంగ్రెసును గెలిపిస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లయింది.. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా..? యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తాలేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు.

మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణిచివేస్తున్నారు. ఇది పోరాటాల పురిటి గడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయండి. అంటూ కవిత ట్వీట్ చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు