Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ACB : రేషన్ కార్డు కోసం లంచం.. పట్టుకున్న ఏసీబీ..!

ACB : రేషన్ కార్డు కోసం లంచం.. పట్టుకున్న ఏసీబీ..!
మన సాక్షి , వెబ్ డెస్క్:
రేషన్ కార్డు కోసం లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు దొరికిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న చిట్టెం శెట్టి నవక్రాంత్ అవినీతి అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదారుడు బంధువులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డు పొందే ప్రక్రియలో ఆన్లైన్ పోర్టల్ లో దరఖాస్తును అప్లోడ్ చేయడానికి గాని సహాయం చేయాల్సిందిగా కంప్యూటర్ ఆపరేటర్ ను అడిగాడు. అందుకు అతను 2500 రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు అతడు డిజిటల్ రూపంలో ఇవ్వగా ఏసీబీ అధికారులు బృందం అతన్ని రెడ్ హండ్ డ్ గా పట్టుకుంది.









