Brs B form : 51 మందికే బీఆర్ఎస్ బీఫామ్ లు.. కవితకు బీఫామ్ అందజేసిన కేసిఆర్, షాక్..!
Brs B form : 51 మందికే బీఆర్ఎస్ బీఫామ్ లు.. కవితకు బీఫామ్ అందజేసిన కేసిఆర్, షాక్..!
హైదరాబాద్ , మన సాక్షి:
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి , ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఆదివారం బీఫామ్ లు అందజేశారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం బి ఫామ్ లు అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొట్టమొదట 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వారిలో మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారడంతో 114 మంది అభ్యర్థులను టిఆర్ఎస్ ప్రకటించారు. కానీ కేవలం 51 మంది అభ్యర్థులకు మాత్రమే ఆదివారం కేసీఆర్ బీఫాంలో అందజేశారు. వారికి రేపు బీఫాంల అందజేస్తామని కేసీఆర్ తెలిపారు.
ALSO READ : Kcr Twist : కెసిఆర్ బిగ్ ట్విస్ట్.. బీ ఫామ్ లు వారికేనా, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..!
కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారమ్ అందుకున్నారు. ఉమ్మడి మెదక్, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు.
బీ-ఫారమ్ అందుకున్న వారిలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలకు అభివందనం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్,
ALSO READ : Congress First List : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఇవీ పేర్లు..!
మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, పువ్వాడ అజయ్, లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వర్ రావు, మెచ్చా నాగేశ్వర్ రావుతో పాటు పలువురు బి ఫామ్ లు అందుకున్నారు.









