Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Congress First List : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఇవీ పేర్లు..!

Congress First List : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఇవీ పేర్లు..!

మన సాక్షి : తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేయాల్సి ఉండగా ఉదయం 9 గంటలకే మొదటి జాబితాను విడుదల చేశారు. 55 మంది అభ్యర్థుల జాబితాతో మొదటి జాబితా విడుదలైంది.

వివాదం లేని స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులుగా తొలుత ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో మరో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను సైతం ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి జాబితాలో టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు బట్టు విక్రమార్క, పోదెం వీరయ్య , జగ్గారెడ్డి , శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఉన్నాయి.

కాగా మొదటి జాబితాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు లేకపోవడం గమనార్హం. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు కూడా మొదటి జాబితాలోనే స్థానం దక్కింది.

మరిన్ని వార్తలు