Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!

మీరు నాలుగు గోడల మధ్య కూర్చొని ఇంటర్నెట్లో సెర్చింగ్ చేసేది, ఓపెన్ చేసిన సైట్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా..? మీరు ఓపెన్ చేసిన ప్రతి సైట్ పాస్వర్డ్లు అన్నీ కూడా అక్కడ స్టోర్ అవుతాయి. మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడ స్టోర్ అవుతుందని మీకు తెలుసా..? ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ముఖ్యమైన ఎనిమిది గూగుల్ ఉంటాయి:

Online History : మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడుంది.. మీరు ఓపెన్ చేసే సైట్లు, పాస్ వర్డ్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి.. తెలుసుకోండి ఇలా..!

మన సాక్షి , ఇంటర్నెట్ :

మీరు నాలుగు గోడల మధ్య కూర్చొని ఇంటర్నెట్లో సెర్చింగ్ చేసేది, ఓపెన్ చేసిన సైట్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా..? మీరు ఓపెన్ చేసిన ప్రతి సైట్ పాస్వర్డ్ లు అన్నీ కూడా అక్కడ స్టోర్ అవుతాయి. మీ ఆన్ లైన్ చరిత్ర అంతా అక్కడ స్టోర్ అవుతుందని మీకు తెలుసా..? చాలామంది తాము ఓపెన్ చేస్తున్న సైట్లు ఎవరికి తెలియదు అనకుంటారు. కానీ మనం సెర్చ్ చేసే ప్రతి సైటు కూడా స్టోరేజీ అయ్యి ఉంటుంది.  ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ముఖ్యమైన ఎనిమిది గూగుల్ ఉంటాయి:

ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి కూడా గూగుల్ ఉపయోగిస్తున్నాము. ఆన్ లైన్ సెర్చింగ్ చేయడం విషయం తెలుసుకోవడం సర్వసాధారణంగా మారింది. కానీ మీరు ఆన్ లైన్ ఓపెన్ చేసిన కొన్ని వెబ్ సైట్లు మీ అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తాయి.

మీ నుంచి సేకరించిన వివరాలను..  తెలియజేస్తూ అప్రమత్తం చేయడానికి గూగుల్ కొన్ని కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ముఖ్యమైన గూగుల్ యు ఆర్ ఎల్ ( URL) లో మీ అనుమతి లేకుండా ఈ వ్యక్తిగత వివరాలు నిల్వ చేయబడుతున్నాయి. అంతేకాకుండా మీ వ్యక్తిగత వివరాలను వెంటనే లాక్ చేసే సౌకర్యం కూడా గూగుల్ అందిస్తుంది. మీ ప్రైవేట్ వివరాలన్నింటినీ భద్రపరచుకోవడానికి, మీరు ఒక్కో ప్రదేశానికి మారినప్పుడు వివరాలు మారుతూ ఉంటాయి. వీటిని గూగుల్ నుంచి పొందడానికి ఎనిమిది గూగుల్ URL లింకులు తెలుసుకోవాలి. ఆ ఎనిమిది గూగుల్ వివరాలు.. ఏంటో చూద్దాం..

ప్రతి గూగుల్ వినియోగదారుడు ముఖ్యమైన యుఆర్ఎల్ (URL)లను తెలుసుకోవాల్సి ఉంటుంది.

1. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా మీ ఐఫోన్ జేబులో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్తున్నారో గూగుల్ సర్వర్ లో నిల్వ చేయబడి ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్ వెబ్ సైట్ లో సందర్శించిన స్థలాలు మొత్తం గూగుల్ లో స్టోర్ అయి ఉంటాయి. మీరు kml ఫైల్ గా వాటిని ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండ వాటిని గూగుల్ ఎర్త్ లేదా గూగుల్ డిస్క్ లో కూడా చూడవచ్చును. దానికోసం మీరు గూగుల్ google.com/maps/timeline లింక్ ను ఉపయోగించవచ్చును.

2. మీ కంటెంట్ వేరే వెబ్ సైట్లో కనిపిస్తే దానిని తీసివేయడానికి మీరు గూగుల్ కి వెళ్లి ఆ సైట్లో DMCA ఫిర్యాదుకు ఫైల్ చేయవచ్చును. కంటెంట్ ను క్లెయిమ్ చేయడంలో మీకు సహాయం చేయడానికి గూగుల్ ఒక సాధారణ విజార్ట్ ని కలిగి ఉంది. గూగుల్ శోధన ఫలితాల నుండి ఆ వెబ్ సైట్లను తీసివేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చును. అందుకోసం గూగుల్ యు ఆర్ ఎల్ (URL) లో support.hoohle.com/legal ఉపయోగించవచ్చును.

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!

3. గూగుల్ పర్యావరణ వ్యవస్థ నుండి మీరు మొత్తం డేటాను సులభంగా ఎగుమతి చేయవచ్చును. గూగుల్ ఫోటోలు, పరిచయాలు, జీమెయిల్ లో వచ్చే మెసేజ్ లు, మీ యూట్యూబ్ వీడియోలను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చును. డౌన్ లోడ్ లింకులను పొందడానికి www.google.com/takeout లింకును ఉపయోగించవచ్చును.

4. మీరు సందర్శించే సైట్ల ఆధారంగా మీ వయసు, లింగం, ఆసక్తులు ఊహించి మీ ప్రొఫైల్ ను గూగుల్ సృష్టిస్తుంది. అది మీకు మరిన్ని వాణిజ్య ప్రకటనలు అందించడానికి ఈ డేటాను ఉపయోగిస్తుంది. వీటిని గూగుల్ యు ఆర్ ఎల్ (URL) www.google.com/settings/ads లో చూడవచ్చును.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

5. గూగుల్ కానీ,  ఇతర ఆన్ లైన్  సెర్చింగ్ ల ద్వారా వివిధ వెబ్ సైట్లకు వెళ్ళండి. మీరు ఆ సైట్లలో పాస్ వర్డ్ లను నమోదు చేస్తారు. కొంతమంది అనేక పాస్ వర్డ్ లను ఉపయోగిస్తుంటారు. అవన్నీ గూగుల్ ద్వారా నిలువ చేయబడతాయి. passwords.google.com ద్వారా మీ గత పాస్ వర్డ్ అన్నింటిని తనిఖీ చేయవచ్చును.

6. మీ మొబైల్ ఫోన్ పోతే దాన్ని ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రేస్ చేయొచ్చు. కానీ మీ ఫోన్ డేటా ఆన్ లో ఉండాలి. అప్పుడు మీరు ఆ ఫోన్ స్థానాన్ని చూసే అవకాశం ఉంది. అంతే కాదు ఫోన్ లోని కంటెంట్లను కూడా తొలగించవచ్చు . మీరు మీ కోల్పోయిన ఫోన్ IMEI నెంబర్ మీ గూగుల్ ఖాతా ద్వారా కూడా కనుగొనవచ్చును. వీటన్నింటి కోసం Google.com/android/debicemanager గూగుల్ యు ఆర్ ఎల్ (URL) ని ఉపయోగించాలి.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

7. మీ google ఖాతాను వేరొకరు ఉపయోగిస్తున్నారా..? లేదా హ్యాక్ చేయబడిందా..? అని అనుమానం ఉందా..? అయితే మీ సందేహాన్ని నివృత్తిని చేసుకోవడానికి గూగుల్ ఉపయోగించుకోవచ్చును. లాగ్, ఐపి చిరునామా ఇటీవల మీ గూగుల్ కు కనెక్ట్ చేయబడిన ప్రాంతం myaccount.google.com/security గూగుల్ యు ఆర్ ఎల్ (URL) లో చూడవచ్చును.

8. మీరు టైపు చేసే, కానీ మాట్లాడే ప్రతి పదాన్ని గూగుల్, యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లలో రికార్డు చేస్తాయి.  మీరు వివిధ వెబ్ సైట్ లో సెర్చ్ చేసే ప్రతి గూగుల్ ప్రకటన యొక్క లాగ్ ను ఉంచుతారు. యూట్యూబ్ లో చూసే ప్రతి వీడియో, గూగుల్ లో మీరు సెర్చ్ చేసే ప్రతిది నిల్వ చేయబడుతుంది. టైప్ చేయడం ద్వారా గూగుల్ సెర్చ్ కోసం history.google.com పూర్తి వివరాలను కనుగొనవచ్చును. వాయిస్ సెర్చ్ కోసం..  history.google.com/history/audio యూట్యూబ్ సెర్చ్ కోసం..  youtube.com/feed/history తెలుసుకోవచ్చును.

ALSO READ : ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!