Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు మేకలు పెంపకానికి రుణాలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకం పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకానికి కోటి రూపాయలు ఇవ్వబోతుంది.

Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు మేకలు పెంపకానికి రుణాలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకం పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గొర్రెల మేకల పెంపకానికి కోటి రూపాయలు ఇవ్వబోతుంది.

దానివల్ల దేశంలో గొర్రెలు మేకలు మాంసం ఉత్పత్తి తో పాటు ఉన్ని ఉత్పత్తి కూడా పెరగనున్నది. ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకాన్ని జాతీయ పశుసంవర్ధక కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

డబ్బులు ఎవరికి ఇస్తారు ..?

ఈ పథకాన్ని ఒక వ్యక్తి పొందవచ్చును. లేదా కొంతమంది కలిసి గ్రూపుగా ఏర్పడి పొందవచ్చును. అంతేకాకుండా సహకార సంఘం గా స్వయం సహాయక బృందంగా ఏర్పడి కూడా పొందవచ్చును. ఈ పథకాన్ని అన్ని సామాజిక వర్గాల వారు పొందవచ్చును.

ALSO READ : MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!

డబ్బులు ఉచితంగా ఇస్తారా..?

పథకంలో డబ్బులు ఉచితంగా ఇవ్వరు. ఇది రుణ పథకం. కోటి రూపాయలు ఇస్తారు. కానీ దానిలో 50 లక్షల కు మాత్రం రాయితీ ఉంటుంది. ఈ రాయితీని రెండు విడతల్లో అందజేస్తారు . నాబార్డ్ సహకారంతో దీనిని అమలు చేస్తున్నారు. రుణంగా ఇచ్చే 50 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలను బ్యాంకులు ఇస్తాయి. మిగతా పది లక్షల రూపాయలను లబ్ధిదారులు పెట్టుకోవాల్సి ఉంటుంది.

నిబంధనలు ఏంటి ..?

ఈ పథకం లబ్ధిదారులకు నిబంధనలు ఏంటి అంటే..? ఈ పథకంలో ఇచ్చే డబ్బులతో 500 ఆడమేకలు లేదా గొర్రెలు, 25 పోతులను కొనాలి.  వాటిని ఒక ఎకరం నుంచి 5 ఎకరాల సొంత స్థలం గాని లేదా లీజుకు తీసుకున్న స్థలంలో పెంచాల్సి ఉంటుంది.

ALSO READ : ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ముందుగా www.nlm.udyamimitra.in వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీ పేరు, అడ్రస్, షెడ్డు నిర్మాణ వివరాలు ,గ్రాసం పెంచే చోటు, స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరణ సర్టిఫికెట్ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది .

ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి..?

20 23 24 ఆర్థిక సంవత్సరానికి గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాబట్టి మీరు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత పశుసంవర్ధక శాఖ అధికారులు మీరు చెప్పిన అడ్రస్ కి వస్తారు. అక్కడ గొర్రెలు మేకలు పెంచే వీలు ఉందో..? లేదో..? చూస్తారు. అంతా బాగానే ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడు ఈ పథకాన్ని పొందవచ్చును.

ALSO READ : NBR FOUNDATION GOOD NEWS : నిరుద్యోగులకు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. అక్టోబర్ 4న మెగా జాబ్ మేళా..!

 

https://manasakshi.in : మన సాక్షి తెలుగులో.. బ్రేకింగ్ , క్రైమ్, పొలిటికల్ న్యూస్.. ఎప్పటికప్పుడు అందిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు అందిస్తుంది.