Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

త్రోబాల్‌ భారత జట్టులో నల్గొండ బిడ్డకు చోటు..!

జాతీయ స్థాయి త్రోబాల్‌లో సత్తాచాటి భారత జట్టుకు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి బిడ్డ ఆకుల అక్షిత ఎంపికయ్యారు.

త్రోబాల్‌ భారత జట్టులో నల్గొండ బిడ్డకు చోటు..!

– ఏషియన్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన ఆకుల అక్షితకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అభినందనలు

– 10 వేల ఆర్థిక సహాయం అందజేత

చింతపల్లి, మన సాక్షి :

జాతీయ స్థాయి త్రోబాల్‌లో సత్తాచాటి భారత జట్టుకు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి బిడ్డ ఆకుల అక్షిత ఎంపికయ్యారు. ఏషియన్ చాంపియన్‌ షిప్‌కు సిద్ధమవుతున్న చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి బిడ్డ ఆకుల అక్షితకు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Also Read : Nalgonda : నల్గొండలో దారుణం.. అపార్ట్ మెంట్ లో వ్యక్తి హత్య..!

అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి, తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఆయన అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అక్షితకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Also Read : విద్యార్థులపై ప్రైవేటు టీచర్ దాస్టికం..?

ఏషియన్ చాంపియన్‌షిప్‌లో అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాచర్ల శ్రీశైలం, ఉప సర్పంచ్ పగడాల వెంకటయ్య, ఆకుల జగతయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు