Nalgonda : నల్గొండలో దారుణం.. అపార్ట్ మెంట్ లో వ్యక్తి హత్య..!
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Nalgonda : నల్గొండలో దారుణం.. అపార్ట్ మెంట్ లో వ్యక్తి హత్య..!
మన సాక్షి, నల్గొండ :
నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని మీర్ బాగ్ కాలనీ రోడ్డు నెంబర్ 6 లోని రెసిడెన్సి అపార్ట్మెంట్ లో హత్య ఘటన జరిగింది.
నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈ షాపింగ్ మాల్ నిర్మాణ పనులకు చెన్నై నుంచి కొంత మంది కూలీలు వచ్చారు. కాగా ఆ అపార్ట్మెంట్ లో 4 వ అంతస్తులో రూమ్ నెంబర్ 402 లో కూలీలు ఉంటున్నారు. కూలీ డబ్బుల విషయంలో ఒకరికి ఒకరితో మాట మాట పెరగడంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం.
సంఘటన స్థలాన్ని డిఎస్పి శివరామిరెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టూ టౌన్ సిఐ ఆదిరెడ్డి, ఎస్ఐ సైదాబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీం తో దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
- చలో విజయవాడ కు వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులకు అనుమతి లేదు..!
- District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం డిమాండ్ చేసిన ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్..!
- Mahabubnagar : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!
- Miryalaguda : వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. నీ బండారం బయటపడుద్ది.. ఎమ్మెల్యే కు బిఆర్ఎస్ నాయకుల కౌంటర్..!









