Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

Mahabubnagar : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో నెలసరి పింఛన్ తీసుకునేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన బాలానగర్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Mahabubnagar : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

మహబూబ్ నగర్, మన సాక్షి జిల్లా ప్రతినిధి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో నెలసరి పింఛన్ తీసుకునేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన బాలానగర్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చింతకుంట తండాకు చెందిన హూనియా (74) పింఛన్ కోసం బైక్‌పై వెళ్తుండగా కేతిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హూనియాకు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అందుకున్న 108 సిబ్బంది హూనియాను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు