Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుములుగు జిల్లా

మంచం మీద నిద్రిస్తుండగా 6 నెలల పసికందును కాటేసిన పాము..!

ములుగు జిల్లా తడువాయి మండలం వెంగళపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పాము కాటుతో ఆరు నెలల పసికందు మృతి చెందాడు.

మంచం మీద నిద్రిస్తుండగా 6 నెలల పసికందును కాటేసిన పాము..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ములుగు జిల్లా తడువాయి మండలం వెంగళపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పాము కాటుతో ఆరు నెలల పసికందు మృతి చెందాడు. దాంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. గ్రామానికి చెందిన తిరుపతి – స్వప్న దంపతుల ఆరు నెలల కుమారుడు ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

పసికందు మంచం పై పడుకొని ఉండగా పాము కాటేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా చిన్నారి తల్లి దానిని గుర్తించి వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే చిన్నారి పరిస్థితి విషమించి మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొనడంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు