Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలోని జిజేసి గ్రౌండ్‌లో స్వచ్ఛభారత్..!

మిర్యాలగూడ పట్టణంలోని జిజేసి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలోని జిజేసి గ్రౌండ్‌లో స్వచ్ఛభారత్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని జిజేసి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌వీఆర్ ఫౌండేషన్ చైర్మన్, 17వ వార్డు కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెబోయిన వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొర్ర కృష్ణకాంత్ నాయక్, జిజేసి గ్రౌండ్ పరిసరాల, పరిశుభ్రత ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌వీఆర్ ఫౌండేషన్ చైర్మన్, 17వ వార్డు కౌన్సిలర్ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారే ముందుండి శ్రమ దాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. కన్న తండ్రిని కొట్టి హత్య చేసిన కుమారుడు..!

జిజేసి గ్రౌండ్‌ను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేందుకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు జిల్లా ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీ నాయక్, ఎం ఈ ఓ వెంకన్న నాయక్, వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జానకిరామ్ రెడ్డి, కార్యదర్శులు పులి శ్రీనివాస్ గౌడ్, నామ రత్నకుమార్, డైరెక్టర్లు సత్యనారాయణ, సక్రాం నాయక్, డాక్టర్ మునీర్, సత్యం, మహేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాధి రాజేశ్వరి, సైదులు, వాకర్ సభ్యులు హేమ్ల నాయక్, అనిల్, నాగు నాయక్, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు