MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!

MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!

ఆ రెండు సిద్ధాంతాల పైనే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది

కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ రెండు కుటుంబ పార్టీలే

మహబూబ్ నగర్ , మన సాక్షి ప్రతినిధి :

తెలంగాణ ప్రభుత్వం కరప్షన్ కమిషన్ అనే సిద్ధాంతాల మీద పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆదివారం పాలమూరు జిల్లాలో ఆయన పర్యటించారు అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ బి ఆర్ ఎస్ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే అని అన్నారు. కరప్షన్.. కమిషన్ అనే సిద్ధాంతాల మీద తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చాలని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వ కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది.. మీకు తెలుసు కదా..? స్టీరింగ్ ఎవరు తిప్పుతున్నారు..? తెలంగాణ ప్రభుత్వాన్ని రెండు కుటుంబాలు నడిపిస్తున్నాయి. కరప్షన్.. కమిషన్ ఆ రెండు పార్టీల విధానం. పార్టీ ఆఫ్ ది ఫ్యామిలీ.. బై ది ఫ్యామిలీ.. ఫర్ ది ఫ్యామిలీ.. అన్నది వాళ్ళ నినాదం.

ప్రజాస్వామ్యాన్ని వాళ్లు కుటుంబ పాదంగా మార్చాలని విమర్శించారు. ఆ పార్టీలో అందరూ కుటుంబంలోని వాళ్లే ప్రతి కీలక పదవిలో కుటుంబంలోని వాళ్లే కూర్చుంటారు. పార్టీలో ప్రతి నిర్ణయం వాళ్ల చేతుల్లోనే ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు శుభదినం. ప్రజలు ఎప్పుడూ బిజెపికి అండగా నిలుస్తున్నారు.

అని మోడీ పైన గ్యారెంటీ పైన ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. తెలంగాణలో బిజెపికి ఆదరణ పెరుగుతుందని పాలమూరు సభలో పాల్గొన్నందుకు తన జన్మ ధన్యమైంది అన్నారు. స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా 13500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ALSO EAD : Suryapet : గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ చేసిన మంత్రి.. అనంతరం కొట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు..!

2014 కన్నా ముందు 2500 మేర జాతీయ రహదారులు ఉంటే మా పాలనలో తెలంగాణలో 2500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించామన్నారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం లేకపోయినా పదివేల కోట్లు రైతులకు కిసాన్ సమన్ నిధి ద్వారా చేశామన్నారు.

దేశంలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసి పసుపు రైతులను ఆదుకుంటామన్నారు. ములుగు జిల్లాలో 900 కోట్ల రూపాయల ఖర్చుతో సమ్మక్క సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు కనీసం మద్దతు ధర కింద 27 వేల కోట్లు ఖర్చు చేశామని గతంతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ అన్నారు.

ALSO READ : NBR FOUNDATION GOOD NEWS : నిరుద్యోగులకు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. అక్టోబర్ 4న మెగా జాబ్ మేళా..!

సాగునీటి కాలువలు ఏర్పాటు చేశామని తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. కాలువలు ఉన్న వాటిలో నీరు ఉండదు. రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కారు అక్రమాలకు పాల్పడుతుందన్నారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు ప్రాణాలు తీసుకున్నారని అన్నారు.

తెలంగాణలో మా ప్రభుత్వం లేకున్నా రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పారదర్శక ప్రభుత్వం రావాలని నాలుగేళ్లలో తెలంగాణ ప్రజలు బిజెపిని బలోపేతం చేశారన్నారు .

ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!

అబద్దపు వాగ్దానాలు కాదు క్షేత్రస్థాయి పనులు తెలంగాణకు కావాలని రాని రుద్రమ పుట్టిన నేల తెలంగాణ చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. తెలంగాణ అక్క చెల్లెళ్లకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా ముద్రా రుణాలు అందిస్తున్నామని, పేదలకు ఇల్లు ఉచితంగా గ్యాస్ అందిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు.

ALSO READ : Train Derails Video : ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. ఇంజన్ క్యాబిన్ లో సీసీ కెమెరా దృశ్యాలు..!