Train Derails Video : ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. ఇంజన్ క్యాబిన్ లో సీసీ కెమెరా దృశ్యాలు..!

ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫారం పైకి రైలు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది.

Train Derails Video : ప్లాట్ ఫామ్  పైకి దూసుకెళ్లిన రైలు.. ఇంజన్ క్యాబిన్ లో సీసీ కెమెరా దృశ్యాలు..!

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫారం పైకి రైలు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది.

ఇఎంయు రైలు ఇంజన్ లో ఉన్న సీసీటీవీ దృశ్యాల్లో ప్రమాదంపై క్లారిటీగా వచ్చింది. రైలు ప్రమాదానికి ముందుగా ఆ ఇంజన్ లోకి ఉద్యోగి ఎంటర్ అయ్యారు. అప్పటికే వీడియో కాల్ లో ఉన్న ఉద్యోగి తన భుజాలకు ఒక బ్యాగు వేసుకుని ఉన్నాడు.

ఆ బ్యాగును ఇంజన్ పై పెట్టాడు. అయితే బ్యాగ్ ప్రెజర్ వల్ల ఇంజన్ త్రెటల్ ఆన్ అయింది. ఆ తర్వాత ఇంజన్ ఫార్వార్డ్ పొజిషన్ కు వెళ్ళింది. ఆ బ్యాగు పెట్టిన ఉద్యోగి సచిన్ గా గుర్తించారు. ఈ ప్రమాద సమయంలో ఇంజన్ లో ఉన్న ఉద్యోగి మద్యం తాగి ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు డిఆర్ఎం తేజ్ ప్రకాష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించారు. ఉద్యోగి సచిన్ ను ప్రస్తుతం మెడికల్ టెస్ట్ కోసం పంపారు. అతని బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు.

ALSO READ :