Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!

మనిషి మరణాంతర జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నానని అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన డేవిడ్ హాంజెల్ అనే వ్యక్తి చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!

మన సాక్షి , ఇంటర్ నెట్ :

మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో.? అని పలువురు పలు రకాలుగా చర్చించుకోవడం తెలిసిందే. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్వర్గం , నరకం అంటూ రకరకాలుగా చర్చలు సాగుతుంటాయి. పలు సినిమాలలో కూడా స్వర్గ ద్వారం, నరక ద్వారం అంటూ చూపించారు.

అయితే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామా..? లేక నరకానికి వెళ్తామా..? అనే డౌటు చాలామందికి కూడా ఉంటుంది.
కొందరు స్వర్గమని.. మరికొందరు నరకం అని అంటుంటారు. స్వర్గం, నరకం ఉన్నాయనేది నమ్మితే మరికొందరు శాశ్వత గాడ నిద్రలోకి వెళ్లిపోయిన అనుభూతి కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది బతికున్న ఎవరికి తెలియదని చెప్పవచ్చును.

అయితే తాజాగా అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన డేవిడ్ హాంజెల్ అనే వ్యక్తి మరణాంతర జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నట్లుగా చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. 2015లో డేవిడ్ హాంజెల్ అనే వ్యక్తి సెప్సిస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆసుపత్రిలో చేరాడు.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

ఈ అనారోగ్యాల కారణంగా ఆయన రెండు నెలల పాటు కోమాలోకి వెళ్ళాడు. అదే సమయంలో చావు అంచుకు వెళ్లి ఉన్న అనుభవం అతనికి లభించింది. తాను మరణాంతరం జీవితంలోకి వెళ్లినట్లుగా డేవిడ్ చెపుతున్నాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు తాను కన్నుమూశానని, మరుక్షణమే తన కళ్ళు మళ్లీ తెచ్చుకున్నాయని అప్పుడే చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో చూసే అవకాశం దక్కినట్లుగా పేర్కొంటున్నాడు.

ఆ జీవితానికి ప్రారంభం లేదా, ముగింపు లేదని అది అందమైన మృదువైన సిల్కీ నైట్ స్కై గా ఉందని చెప్పుకొచ్చాడు. మరణానికి అంచున ఉన్న తన అనుభవాన్ని ఇంకా చెబుతూ తాను దేవదూతలను కలిశానని, మరణాంతర జీవితంలోకి వెళ్లే అన్నింటిని చూసానని వివరించాడు. జీవితంలో ముత్యాల ద్వారాలు లేవని అందుకు బదులుగా అక్కడ పబ్ ఉందని, కానీ పబ్ లో అందమైన రంగు సీసాలు ఉన్నాయి.. కానీ మద్యం ఎక్కడా కనిపించలేదని డేవిడ్ పేర్కొన్నాడు.

ALSO READ ; Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!

అందమైన పాలరాతితో నిర్మించిన స్కై స్క్రాపర్ వైపు తాను తేలి ఆడుతున్నట్లు అప్రయత్నంగా నడుస్తున్నట్లు అనిపించినట్లు డేవిడ్ చెప్పాడు. చనిపోయిన తర్వాత జీవితంలో కనిపించే ఇలాంటి అందమైన వాతావరణంలో తనను ఇద్దరు గైడ్ చేసిన్నట్లు డేవిడ్ పేర్కొన్నాడు. ఆ ఇద్దరు తనకు అందమైన బంగారు వర్ణం కాంతిని చూపించారని తెలిపాడు. ఈ జీవితంలో తాను బార్ లేదా పబ్ కి వెళ్లానని ఇది తాను ఎప్పుడూ ఊహించలేదని ఆశ్చర్యంగా వ్యక్తం చేశాడు.

రెండు నెలల తర్వాత తాను కోమా నుంచి బయటికి వచ్చాడు. ఆపాటికి అతని అనారోగ్యాలన్నీ తగ్గిపోయాయి. అంతేకాదు అతనికి జ్ఞానోదయం కూడా కలిగింది. గతంలో తను చెడు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించాలని భావించాడు. ఈ అనుభూతితో ప్రజలు తరచుగా మాట్లాడుకునే క్షమాపణ , మతం అర్థం తెలిసిందని చెప్పాడు. అయితే చనిపోయిన ప్రతి ఒక్కరి జీవితం ఇలా ఉంటుందా..? లేదా..? అనేది తెలియదు. కానీ డేవిడ్ మాత్రం ఇది ఒక అందమైన ప్రపంచంలో ఉంటుందని చెప్పాడు.

ALSO READ : Janareddy : ఎన్నికల్లో పోటీపై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!