Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంతెలంగాణరాజకీయం

Janareddy : ఎన్నికల్లో పోటీపై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Janareddy : ఎన్నికల్లో పోటీపై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

న్యూ ఢిల్లీ:

రాబోయే ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అభ్యర్థుల దరఖాస్తులకు కూడా ఆయన దరఖాస్తు చేసుకోలేదనే విషయం తెలుసిందే.

శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో న్యూఢిల్లీలో ఆయన భేటీ అయ్యారు. బేటిలో రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని.. అసెంబ్లీకి నా కుటుంబం నుంచి పోటీ చేస్తారని అన్నారు . తెలంగాణలో గెలిపించడానికి ఐక్యవేదిక అవసరం అని కార్గేకు సూచించినట్లు ఆయన తెలిపారు. అందరూ ఐక్యంగా పోరాడాలని ఖర్గే సూచించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని జానారెడ్డి పేర్కొన్నారు.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

మరిన్ని వార్తలు