నల్గొండBreaking Newsక్రైంజిల్లా వార్తలు
Nalgonda : తాళ్లతో క్రూరంగా బంధించి.. పశువుల తరలింపు..!
Nalgonda : తాళ్లతో క్రూరంగా బంధించి.. పశువుల తరలింపు..!
కొండమల్లేపల్లి, మన సాక్షి :
తాళ్లతో క్రూరంగా బంధించి అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్న ఘటన మంగళవారం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రామ్మూర్తి సిబ్బంది చెన్నారం గేటు వద్ద అక్రమంగా పశువుల రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఓ మినీ డీసీఎం పట్టుకొని తనిఖీ చేయగా అందులో 16 గోవులు ఉన్నట్లు గుర్తించారు.
ఆ మినీ డీసీఎంను సీజ్ చేసి పశువులను నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ లోని గురునానక్ గోశాలకు పంపించి ఇద్దరు వ్యక్తులు యాచారపు రమేష్ యాచారపు శేఖర్ ను పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.అక్రమంగా పశువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది.









