తాళం వేసిన ఇంట్లో చోరీ..!
తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకీ పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజిలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంతిరెడ్డిపల్లి గ్రామంలో గోరటి అలివేలు ఫిబ్రవరి 27న తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లోని తన కుమారుని నివాసానికి చేరుకున్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ..!
వెల్దండ, మన సాక్షి :
తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకీ పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజిలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంతిరెడ్డిపల్లి గ్రామంలో గోరటి అలివేలు ఫిబ్రవరి 27న తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లోని తన కుమారుని నివాసానికి చేరుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం మార్చి 01న ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి బడటం గమనించి ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి అర్థతులం బంగారం, రెండు వెండి మొలతాడులను రూ.10 వేల రూపాయలు దొంగిలించ బడి, బీరువా లోని బట్టలు కాల్చి వేశారని వాపోయారు.
వాటి మొత్తం విలువ 1 లక్ష 50 వేల రూపాయల విలువగల వస్తువులను దొంగిలిచారని వెల్దండ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు . బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు.
ఇవీ చదవండి:
- నల్గొండ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య..!
- Ration Cards : రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త..!
- Khammam : వెలుగుమట్ల బాధితులకు బీజేపీ అండ.. బాధితులను పరామర్శించిన ఈటెల..!
- Nalgonda : నల్గొండలోని వైద్య కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం.. హాజరైన జిల్లా కలెక్టర్..!