Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!
Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ . 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!
మనసాక్షి, వెబ్ డెస్క్ :
ఒకేసారి బ్యాంకు ఖాతాలోకి ఒకటి కాదు, రెండు కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. దాంతో అతడికి పట్టరాని ఆనందం కలిగింది. నిజమా..? కాదా..? అని విచారణ చేశాడు. అది నిజమే అని తేలింది. దాంతో మరింత ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అదేంటో తెలుసుకుందాం..
తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్ కు ఊహించని అనుభవం కలిగింది. అతడి బ్యాంక్ అకౌంట్ లోకి ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటుచేసుకుంది.
ALSO READ : Chandra Babu : చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. సిఐడి కస్టడీకి చంద్రబాబు..!
అందుకు సంబంధించిన వివరాలు.. పలని.. నైకార పట్టి కి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి చెన్నైలోని కోడంబాకం లో స్నేహితుడి వద్ద ఉంటున్నాడు. అతని వద్ద ఉంటూ అద్దెకు కారు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతనికి ఈనెల తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది.
దానిని చూస్తే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తన ఖాతాలో జమ అయినట్లు ఉంది. దాంతో రాజ్ కుమార్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అది నిజమా.? కాదా..? అని తెలుసుకునేందుకు తన ఖాతా నుంచి తన స్నేహితుడికి 21 వేల రూపాయలు పంపాడు. దాంతో ఆ డబ్బులు అతని స్నేహితుడికి వెళ్లాయి.
ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!
కాగా తన ఖాతాలో అంత మొత్తం ఉన్నది నిజమే అని నిర్ధారణకు వచ్చాడు. తన బ్యాంకు ఖాతాలో ఊహించని విధంగా 9,000 కోట్ల రూపాయలు జమ కావడంతో డ్రైవర్ రాజ్ కుమార్ ఎంతో సంబరపడ్డాడు. అయితే ఆ రాజ్ కుమార్ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంది. కొద్దిసేపటికే పొరపాటున గుర్తించిన సదరు బ్యాంక్ వారు రాజ్ కుమార్ ఖాతా నుంచి పూర్తి డబ్బును తిరిగి తీసేసుకున్నారు.
అంతే కాకుండా తన స్నేహితుడికి పంపిన 21 వేల రూపాయల నగదును కూడా తిరిగి చెల్లించాలని బ్యాంకు వారు రాజ్ కుమార్ కు సూచించారు.
ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!
రాజకుమార్ తరఫున న్యాయవాదులు చెన్నై టీ నగర్ లోని బ్యాంకు శాఖకు వెళ్లి మాట్లాడారు. దాంతో రాజ్ కుమార్ తన స్నేహితుడికి పంపిన 21,000 తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని, వాహన రుణం కూడా ఇస్తామని బ్యాక్ వారు చెప్పినట్లు సమాచారం.. ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ కావడం చర్చనీయాంశంగా మారింది.
https://x.com/ManobalaV/status/1704725379230171539?s=20









