క్రైంBreaking Newsసిద్దిపేట జిల్లా

పోలిస్టేషన్ ముందే కారు అద్దాలు పగలగొట్టి చోరీ..!

పోలిస్టేషన్ ముందే కారు అద్దాలు పగలగొట్టి చోరీ..!

మాజీ ట్రాన్స్ స్కో ఏడీ కారు పగులగొట్టి నగదు అపహరణ..

జోగిపేట లో సంచలనంగా మారిన పట్టపగలు చోరీ ఘటన..

జోగిపేట పోలిస్టేషన్ లో పిర్యాదు.. విచారణ చేపడుతున్న పోలీసులు

అందోలు, మనసాక్షి :

పోలిస్టేషన్ ముందు నిలిపిన కారు అద్దాలు పగులగొట్టి రూ.10 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పట్టణంలో సోమవారం పట్టపగలే చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధిచి వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా అందోలు మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ట్రాన్స్ స్కో ఏడీ రవీందర్ రెడ్డి జోగిపేట ఎస్బిఐ బ్యాంకులో తన కుమారుడు సాయికిరణ్ రెడ్డి అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసేందుకు సెల్ఫీ చెక్కును తీసుకోని పోస్టాఫీస్ ముందు ఉన్న ఎస్ బీఐ బ్యాంకుకు సోమవారం వచ్చాడు.

రూ. 10 లక్షలు డ్రా చూసుకున్నాకా డబ్బులు కవర్ లో ఉంచి తన కారులో పెట్టుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకోని తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్తున్న క్రమంలో పోలిస్టేషన్ వద్ద కారు నిలిపి రోడ్డు అవతల ఉన్న స్వీట్ హౌస్ లో స్వీట్ తీసుకునేందుకు వెళ్ళాడు.

ఐదు నిముషాల్లో తిరిగి కారు వద్దకు వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి కారులో ఉన్న రూ.10 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. దీంతో రవీందర్ రెడ్డి వెంటనే జోగిపేట పోలీసులకు సమాచారం అందించాడు.

వెంటనే సీఐ అనిల్ కుమార్, ఎస్ ఐ పాండు వారి సిబ్బందితో కలిసి బ్యాంకుకు చేరుకొని బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్ లతో పాటు చుట్టు పక్కల ఉన్న, చోరీ జరిగిన ప్రదేశంలో దుకాణాల వద్ద ఉన్న సిసీ పుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

బాధితుడు రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. పట్టపగలే పోలిస్టేషన్ ముందే గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి పది లక్షలు ఎత్తికెళ్ళిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ALSO READ : 

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!

MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!

Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

మరిన్ని వార్తలు