క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

Annamaya : దాడిలో ఇరువర్గాలపై కేసులు నమోదు..!

Annamaya : దాడిలో ఇరువర్గాలపై కేసులు నమోదు..!

– రాజకీయాలు, కులమతాలకు అతీతంగా విచారణ

– సీఐ సత్యనారాయణ వెల్లడి

రామసముద్రం, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, ఎర్రబోయనపల్లి, శ్రీరాములపల్లి గ్రామస్తుల మధ్య ఓ వివాదం విషయమై జరిగిన దాడిని పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం ఎర్ర బోయనపల్లి గ్రామస్తులు ఈ దాడి ఘటనలో తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు భారీగా ప్రజలు చేరుకున్నారు.

.ఎర్ర బోయనపల్లి గ్రామస్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ రామసముద్రం పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. తమ గ్రామస్తులకు ఈ దాడి కేసుకు సంబంధించి అన్యాయం జరిగిందని సీఐ వద్ద మొరపెట్టుకున్నారు. అనంతరం సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఓ మహిళ తన కుమారునితో తిరుమలకు వెళ్లినట్లు చెప్పడం జరిగిందన్నారు.

ఈ మహిళ విషయమై రెండు గ్రామస్తుల మధ్య వివాదం జరిగి గొడవకు దారి తీసిందన్నారు. ఎస్సై రవికుమార్ రెండు గ్రామస్తులు మధ్య విచారణ చేసి రాజీ కుదిర్చడం జరిగిందని పేర్కొన్నారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి గ్రామాలకు వెళుతూ మార్గమధ్యంలో దాడి చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. రెండు గ్రామాలకు చెందినవారు తీవ్రంగా గాయపడి మదనపల్లి, పుంగనూరు, కోలార్ వైద్యశాలలో చికిత్సలు పొందడం జరిగిందని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే విచారణ చేసి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇందులో రెండు గ్రామాల ప్రజలు పైన కేసులు నమోదు చేసి, అరెస్టుకు సిద్ధమవుతున్నట్లు సీఐ తెలియజేశారు. ఎలాంటి ప్రాంతీయ విభేదాలు, రాజకీయాలు, కుల మతాలు లేవని, నిక్షపక్షపాత్రంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు దాడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే షాజహాన్ భాష కూడా సీఐ, ఎస్సైలతో రామసముద్రం పోలీస్ స్టేషన్లో సమావేశమై దాడికి సంబంధించి పలు విషయాలను తెలుసుకున్నారు.

రెండు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా న్యాయం చేయాలని ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు.శ్రీ రాములు పల్లె గ్రామానికి చెందిన 6 గురుని ఎస్సై రవికుమార్ పోలీస్ సిబ్బంది నడింపల్లె గ్రామ సమీపంలో అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ తరలించారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!

  4. TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

మరిన్ని వార్తలు