Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!
మన సాక్షి :
దేశంలోని రైతులందరికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. తక్కువ ధరలకు ఎరువులను అందిస్తామని తెలియజేసింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ఎరువుల ధరల భారాన్ని రైతులపై పడనీయబోమని, సబ్సిడీని పెంచి తక్కువ ధరలకే అందిస్తామని ఆయన తేల్చి చెప్పారు. వ్యవసాయ రంగాన్ని దేశంలో అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
దేశంలోని కోట్లాదిమంది రైతులకు ఎరువులు చౌకగా అందిస్తామని పేర్కొన్నారు. సాధారణంగా యూరియా ధర 2,366 రూపాయలు ఉండగా 266 రూపాయలకే అందిస్తామని చెప్పారు. అదేవిధంగా డి ఏ పి (డీ అమోనియం ఫాస్పేట్) ధర 2433 ఉండగా 1350 రూపాయలకే అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఎరువుల సబ్సిడీని పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2013 – 14 లో 71,250 కోట్ల రూపాయల సబ్సిడీ ఉండగా 2023-24 లో 1,95,420 కోట్ల రూపాయలకు పెంచినట్లు ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్లో డిఏపి ధరల పెరుగుదల ఉందని ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని తెలియజేశారు.
అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి 2625 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలియజేశారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, రైతులు పండించిన పంటలకు సరైన ధర కల్పించడం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలియజేశారు.









