Chandra Babu : చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. సిఐడి కస్టడీకి చంద్రబాబు..!
Chandra Babu : చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. సిఐడి కస్టడీకి చంద్రబాబు..!
విజయవాడ, మనసాక్షి :
స్కిల్ డెవలప్మెంట్ నిధుల అవినీతి కేసులో నారా చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. ఈ కేసులో అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి , టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఇప్పటికే హైకోర్టు బెయిల్ నిరాకరించగా ఏసీబీ కోర్టు కూడా సిఐడి కష్టాడికి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. చంద్రబాబు నాయుడును రెండు రోజులపాటు సిఐడి కష్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనను ఐదు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని సిఐడి అధికారులు కోరినప్పటికీ రెండు రోజులపాటు ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు ప్రకటించింది.
ALSO READ : చంద్రబాబుకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల మళ్లింపు పై విచారించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది వెలుగులోకి వస్తాయని ఏసీబీ కోర్టుకు సిఐడి తరఫున న్యాయవాదులు విన్నవించారు. దాంతో సిఐడి తరఫున న్యాయవాది వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు.
ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!
దాంతో రెండు రోజులపాటు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారిస్తారా..? లేక బయట విచారణ చేస్తారా ..? అని న్యాయమూర్తి ప్రశ్నించగా సిఐడి అధికారులతో మాట్లాడి చెబుతామని కోర్టు కు ఎఎజీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
ALSO READ : బిగ్ బ్రేకింగ్ : ఆర్టీసీ బస్సు పల్టీ ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..!









