Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

చంద్రబాబుకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..!

చంద్రబాబుకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..!

మన సాక్షి , అమరావతి :

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాట్ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో నిధుల దుర్వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఈనెల 22 వరకు రిమాండ్ విధించారు.

కాగా ఈరోజుతో రిమాండ్ గడువు ముగియడంతో చంద్రబాబు నాయుడును పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఆన్ లైన్ ద్వారా విజయవాడ ఏసిబి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి చంద్రబాబు నాయుడు జ్యూడిషల్ రిమాండ్ ను పొడిగించారు. ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ALSO READ : రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజకీయ విమర్శలు చేస్తున్న గుత్తా..!

కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాలను జడ్జి కోరారు. తనను జైలులో ఉంచి మానసిక శోభకు గురి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు న్యాయమూర్తికి వివరించారు. తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడా లని ఆయన కోరారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం తనదని , తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని, తన తప్ప ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని పేర్కొన్నారు.

తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందని, అన్యాయంగా తనను అరెస్టు చేశారని చంద్రబాబు నాయుడు న్యాయమూర్తికి తన గోడు వినిపించారు. కాగా సిఐడి కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనున్నది.

ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు