తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

Shadnagar : షాద్ నగర్ లో చిరుత కలకలం..!

Shadnagar : షాద్ నగర్ లో చిరుత కలకలం..!

షాద్ నగర్, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ లో ఉన్న ఆఫీసర్స్ కాలోనిలో ఠాగూర్ స్కూల్ వెనకాల గురువారం రోజు సాయంత్రం సుమారు ఏడు గంటలకు ఒకరికి చిరుత కనిపించిందని చెప్పటంతో కాలనీవాసులు ఒక సారిగా భయాందోళనకు గురయ్యారు.

ఆ జంతువు చిరుత పులి అయి ఉంటుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతుండగా ఆ సమాచారాన్ని రెండవ వార్డ్ కౌన్సిలర్ చెట్ల పావని నరసింహులుకు చెప్పినారు. ఆయన అధికారులకు ఫోను ద్వారా తెలియజేశారు. దీంతో స్థానిక ఎస్సై ఫారెస్ట్ ఆఫీసర్ అజిజ్ ఫోను ద్వారా సమాచారం తెలియపరిచారు.

తక్షణమే ఫారెస్ట్ ఆఫీసర్ అజీజ్ రాత్రి సుమారు 9 గంటల నుంచి 12 గంటల వరకు కాలనీ వాసులతో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. వ్యవసాయ పొలాల్లో అనుమానాస్పదంగా తిరిగిన జంతువు ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారి అజీజ్ ను అడిగితే అది చిరుత కాదు కుక్క అని తెలుసుకున్నారు.

వ్యవసాయ పొలాల్లో సంచరించిన జంతువు పాదముద్రలను బట్టి కుక్క అని అధికారులు గుర్తించారు. ఏది ఏమైనా ప్రజలు రాత్రి వేళలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలను అధికారులు కోరడం ఏమనగా చిరుత కనిపించిందని ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినచో ప్రజలు భయం బరాంతుల గురవుతారని అన్నారు.

ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినచో వారిపై కఠిన చర్యలు, కేసులు పెడతారని ఫారెస్ట్ ఆఫీసర్ అజిజ్ తెలిపారు. ప్రజలతో అధికారులు కోరటం ఏమనగా ఎక్కడైనా అనుమానిస్థితిలో ఉండే జంతువు కనిపిస్తే ఫోటో గాని, వీడియోలు గాని తీసి అధికారులను పంపాలని కోరుతున్నారు.

LATEST UPDATE : 

District collector : గడువులోగా కష్టం మిల్లింగ్ డెలివరీ చేయకుంటే చర్యలు.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..!

Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!

Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

మరిన్ని వార్తలు