CM Revanth Reddy : తెలంగాణలో అతి భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!
CM Revanth Reddy : తెలంగాణలో అతి భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్‌కో సిబ్బందిని కోరారు.
హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు
భారీ వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
MOST READ :
-
Agricultural Tools : సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు.. దరఖాస్తు ఆహ్వానం..!
-
Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!
-
Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!








