CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!
మన సాక్షి, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా వర్షాల వల్ల పంటలు నష్టపోయిన వివరాలను అంచనావేసి వెంటనే నివేదిక అందజేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. రాష్ట్రంలో చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యాయం చేసి, వరదల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జంతువులు చనిపోతే రైతులకు పరిహారం అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
MOST READ :
-
LPG GAS : గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు..!
-
Shoes : షూస్ ఎంపిక ఎలా ఉండాలో తెలుసా.. ఇలా ఉంటేనే కొనండి..!
-
Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!
-
Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!
-
Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!









