TG News : హుస్సేన్ సాగర్ తీరాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకత శిల్పం..!

TG News : హుస్సేన్ సాగర్ తీరాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకత శిల్పం..!
మన సాక్షి, హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్.. హుస్సేన్ సాగర్ తీరాన రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని రూపొందించారు. సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది.
కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆద్వర్యంలో పీవీ మార్గ్ లోని ఎన్టీయార్ గార్డెన్ వద్ద జరిపిన సంబరాల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు, రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్నిఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా సైకత శిల్పి వరప్రసాద్ ను మంత్రి జూపల్లి అభినందించారు.
MOST READ :










