Penpahad : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు భాగస్వామ్యం కావాలి..!
Penpahad : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు భాగస్వామ్యం కావాలి..!
పెన్ పహాడ్, మన సాక్షి :
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యలు కావాలని ఎంపీడీవో జన్జనాల వెంకటేశ్వరరావు ఎంఈఓ రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏఐడి సంస్థ, బాల రక్ష భవన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి బయట పిల్లలందరి బడిలో చేర్పించాలని, బాల కార్మికు లేని మండలంగా తీర్చిదిద్దాలని వారన్నారు.
బాల రక్ష భవన్ సిబ్బంది షేక్ మీరా, శ్రీలక్ష్మి ,ఎయిడ్ సంస్థ మండల కమిటీ కోఆర్డినేటర్ ఒగ్గు సోమన్న, బాలల హక్కులు- చట్టాలపై ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు, స్కావెంజర్లకు అవగాహన కల్పించి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలన, బాలల అక్రమ రవాణా నిషేధంలో అధికారులు పిల్లల తల్లిదండ్రులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భాగస్వాములై నిర్మూలించాలని కోరారు.
అదేవిధంగా మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో శ్రీ కనకదుర్గ బ్రిక్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్రవంతి, ఏఎస్ఐ రాములు, పి హెచ్ ఎన్ శశిరేఖ, ఏపీఓ రవి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సిఆర్పిఎఫ్ డివిజన్ కన్వీనర్ గజ్జల ధర్మారెడ్డి, సీఆర్పీలు నాగు, సైదయ్య, ఆశా కార్యకర్తలు కవిత, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Suspended : విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఎంఈఓ తో పాటు మరో ఇద్దరు సస్పెండ్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..!
-
Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!
-
Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!









