Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం..!

Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఉన్న శిష్య ది స్కూల్లో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో శిష్య స్కూల్ ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష పండిట్ జవహర్లాల్ నెహ్రు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్కూల్ లో విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు.
అందులో భాగంగా విద్యార్థులు వివిధ వేషధారణలు నిర్వహించగా పలువురిని ఆకట్టుకున్నాయి.
అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో జవహర్ లాల్ నెహ్రూ పాత్ర గురించి వివరించారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అని కొనియాడారు. పాఠశాలలో విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Jubilee Hills : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. ప్రతి రౌండ్ లోను ఆదిత్యం..!
-
Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో ఆకట్టుకున్న జాతీయ నాయకుల వేషధారణలు..!
-
Miryalaguda : సెయింట్ జాన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!










