Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి..!

హాలియా మున్సిపల్ చైర్మన్ గా మున్సిపాలిటీ లొ ఏడవ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన చింతల చంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి..!

వైస్ చైర్మన్ గా రాజా రమేష్ యాదవ్ ప్రమాణస్వీకారం

హాలియా, మన సాక్షి

నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా మున్సిపాలిటీ లొ ఏడవ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన చింతల చంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ మేరకు కౌన్సిల్ సమావేశంలో ఆరవ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు చైర్మన్ అభ్యర్థిగా చింతల చంద్రారెడ్డిని ప్రతిపాదించగా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు ఆమోదం తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి శేఖర్ రెడ్డి చంద్రారెడ్డిని చైర్మన్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు.

వైస్ చైర్మన్ గా ఒకటవ వార్డు కౌన్సిలర్ గౌని రాజా రమేష్ యాదవ్ పేరును 11వ వార్డు కౌన్సిలర్ దేపావత్ ప్రసాద్ కుమార్ ప్రతిపాదించగా రెండవ వార్డ్ కౌన్సిలర్ నకరేకంటి అన్నపూర్ణ సైదులు ఆమోదించారు. దీంతో వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. వెంటనే నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లతో ఎన్నికల అధికారి శేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

 

అంతకుముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు హాలియా పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మూడవ వార్డు కౌన్సిలర్ కుందూరు వెంకటరెడ్డి కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు.

దీంతో 11మంది కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించినట్లు ఎన్నికల అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ చట్టం 20 ప్రకారం నూతన సభ్యుల కమిటీ ఎన్నిక పూర్తయినట్టుగా ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరు నారాయణ గౌడ్ విప్ జారీ చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐలు బండి సాయి ప్రశాంత్, ఉప్పు సురేష్ ల ఆధ్వర్యంలో బందొబస్తూ నిర్వహించారు.

MOST READ 

  1. Nalgonda : నల్గొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి..!

  2. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

  3. Kamareddy : కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్.. ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్..!

  4. Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు ఖరారు.. ఎవరెవరు ఎక్కడ..!

మరిన్ని వార్తలు